పార్టీలోని వ్యక్తులను మేపడం కోసం బడుగు వర్గాలను పస్తులుంచడం దుర్మార్గం: చంద్రబాబు

  • వైసీపీ నేతల జేబులు నింపడం కోసమే ఇసుక కొరతను సృష్టించారు
  • ఎంతో మంది కష్ట జీవులకు పనులు లేకుండా పోయాయి
  • అక్రమాలపై చర్యలు కూడా తీసుకోవడం లేదు
వైసీపీ నేతల జేబులు నింపడం కోసమే ఇసుక కొరతను సృష్టించారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఇసుకను తవ్వడం దగ్గర నుంచి తరలించడం, నిల్వచేయడం, అమ్ముకోవడం అంతా అక్రమమేనని ఆరోపించారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని... అందుకే ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

వైసీపీ ప్రభుత్వ అక్రమాల కారణంగా నిర్మాణరంగంలో కార్మికులుగా పని చేస్తున్న ఎంతో మంది కష్ట జీవులకు పనులు లేకుండా పోయాయని తెలిపారు. పార్టీలోని వ్యక్తులను మేపడం కోసం బడుగువర్గాలను పస్తులుంచడం దుర్మార్గమని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
YSRCP
Sand

More Telugu News